దిశ, వెబ్ డెస్క్: టీవీకేలో విషాదం చోటు చేసుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించిన వీఎస్ బాబు (75) కన్నుమూశారు. కొలత్తూరు నుండి టీవీకే తరపున పోటీ చేసిన బాబు ఎమ్మెల్యేగా స్టాలిన్ పై విజయం సాధించి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. స్టాలిన్ పై బాబు 8,795 మెజార్టీ ఓట్లతో గెలవడం సంచలనంగా మారింది. గెలపు అనంతరం స్టాలిన్‌ను ట్రోల్ చేసి కూడా బాబు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అయితే గత కొన్నినెలలుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న బాబు సెప్టెంబర్‌లో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఈ రోజు మధ్యాహ్నం 2.24 గంటలకు ఆయన కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచారు.
BREAKING: స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే కన్నుమూత