Sathya Velugu, 23 నవంబర్ 2026: దిశ, వెబ్ డెస్క్: తమిళరాజకీయాల్లో నటి త్రిష పేరు గత కొంతకాలంగా మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. సీఎం విజయ్‌తో ఆమె డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమిళనాట త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ టీవీకే గెలుపు వెనక కూడా ఆమెనే ఉండి నడిపించారనే టాక్ ఉంది. మరోవైపు ఛాన్స్ వచ్చినప్పుడల్లా త్రిష పొలిటికల్ ఎంట్రీపైనా వార్తలు గుప్పుమంటున్నాయి. గతంలో ఎన్నికల తరవాత విజయ్ రెండు స్థానాల్లో ఒక స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ నుండి త్రిష బరిలో దిగుతారంటూ ప్రచారం జరిగింది. కానీ అది ప్రచారంగానే మిగిలిపోయింది. ఇక ఇటీవల ఓ టీవీకే ఎమ్మెల్యే మరణంతో మరోసారి త్రిష పేరు వినిపిస్తోంది. ఈ వార్తల సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. త్రిష పేరుతో ఆమె అభిమానులు ఓ సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేశారు.
తమిళనాడులోని తిరునెల్వేలిలో “ఇళయ పురచ్చి తలైవి పెరవాయి” (యంగ్ రెవల్యూషనరీ లీడర్ ఫోరమ్), త్రిషా ఫోరమ్ అనే పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్లో త్రిష రాజకీయ నాయకురాలి లుక్‌లో దండం పెడుతూ కనిపిస్తున్నారు. దీంతో ఈ సంస్థ ద్వారా త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కుదిరితే విజయ్ పార్టీతో కలిసి పనిచేస్తారనే ప్రచారం జరుగుతోంది. లేదంటే సొంతంగా రాజకీయాలు చేయడానికి ఆమె ఎత్తుగడ వేస్తున్నారా? అని కూడా రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే త్రిష అభిమానులు కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థనే పార్టీగా మార్చి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారేమో? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.