Sathya Velugu, 25 నవంబర్ 2026: దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో కదం తొక్కాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FIIs) కొనుగోళ్ల అండతో సూచీలు దాదాపు 2 శాతం మేర దూసుకెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,502.29 పాయింట్లు లాభపడి 83,938.28 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 469.60 పాయింట్లకు పెరిగి 25,819.25 వద్ద ట్రేడ్ అయింది. ఎఫ్ఎంసీజీ (FMCG), ప్రైవేట్ బ్యాంకులు, ఫార్మా, ఆటో రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. హిందుస్థాన్ యూనిలీవర్ (HUL), ఇండిగో, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు మార్కెట్‌ను ముందుండి నడిపించాయి.
బలపడిన రూపాయి విలువ..
మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ అనూహ్యంగా పుంజుకుంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 66 పైసలు బలపడి 92.19 వద్ద స్థిరపడింది. గత ఎనిమిది నెలల్లో రూపాయికి ఇదే అత్యధిక ముగింపు కావడం విశేషం.
భారీగా తగ్గనున్న బంగారం ధర..
ఇవాళ్టి ఆర్థిక పరిణామాలను విశ్లేషిస్తే.. భవిష్యత్తులో బంగారం ధరలు పెరగడం కంటే తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా లాభపడటంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం నుంచి నిధులను ఉపసంహరించి, ఎక్కువ రాబడినిచ్చే ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 66 పైసలు పెరగడం వల్ల విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకునే ఖర్చు తగ్గుతుంది. దీని ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై పసిడి ధరలు దిగిరానున్నాయి.