Sathya Velugu, 28 నవంబర్ 2026: మరిపెడ, ఆంధ్రప్రభ :
మహబూబాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల హాస్టల్ బాత్రూంలో విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చిన ఘటనకు సంబంధించి నిందితుడిని మరిపెడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై ఈ నెల 25న మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో తొలుత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఘటన జరిగిన ప్రదేశం మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.
ఈ కేసులో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రు తండాకు చెందిన బానోత్ శ్యామ్ ప్రసాద్ (31), తండ్రి సామ, ఆటో డ్రైవర్ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అతడిని అరెస్ట్ చేసి శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ వెల్లడించారు.