నెక్కొండ, ఆంధ్రప్రభ : విద్యుత్ షాక్ తో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని చంద్రుగొండ గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మూడుదేని మమత (38) అనే మహిళ ఇంటి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైనట్లు తెలిపారు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిందని అన్నారు. మృతురాలికి భర్త సుధాకర్, ఇద్దరు కుమారులు ఉన్నారు. మమత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.