Sathya Velugu, 29 నవంబర్ 2026: దిశ, నేషనల్ బ్యూరో: ఫోన్ స్క్రీన్లకే పరిమితమైన ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ఇకపై కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి టెలివిజన్ స్క్రీన్‌పై ఆస్వాదించేలా మెటా సంస్థ భారత్‌లో ‘ఇన్స్టాగ్రామ్ ఫర్ టీవీ’ యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ముంబైలో జరిగిన ‘హౌస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్’ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించిన మెటా, రాబోయే కొద్ది రోజుల్లో యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ డివైజ్‌లలో ఇది అందుబాటులోకి వస్తుందని, ఒకే టీవీలో గరిష్ఠంగా ఐదు అకౌంట్ల వరకు లాగిన్ అయ్యే వెసులుబాటు ఉంటుందని తెలిపింది. మొబైల్లో మాదిరిగా స్క్రోల్ చేయాల్సిన పనిలేకుండా టీవీలో రీల్స్ ఆటోమేటిక్‌గా ప్లే అవుతాయని, దీంతో పాటు యూజర్ ఆసక్తిని బట్టి రీల్స్ అందించే ‘ఛానెల్స్’, స్నేహితుల వీడియోల కోసం ‘ఫ్రెండ్స్ ట్యాబ్’, వైడ్‌స్క్రీన్ హారిజాంటల్ రీల్స్‌తో పాటు ఒకే వై-ఫై ద్వారా ఫోన్ నుండి నేరుగా టీవీకి వీడియోలను పంపే క్యాస్టింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయని పేర్కొంది. అలాగే కుటుంబమంతా కలిసి చూసే ప్లాట్‌ఫామ్ కావడంతో ఇందులో కంటెంట్ రేటింగ్ నిబంధనలతో పాటు టీనేజర్ల స్క్రీన్ టైమ్ పరిమితులు, స్లీప్ మోడ్ రిమైండర్లను అమలు చేయనుంది.
Instagram: ఇకపై టీవీల్లోనూ ఇన్స్టాగ్రామ్